రాహుల్‌ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

200
Tamil BJP Complaints Rahul to EC

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై తమిళ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడంతోపాటు కేసు  నమోదు చేయాలని కోరుతూ ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యవ్రత సాహూకు బీజేపీ నేతలు వినతిపత్రం అందించారు.

యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించడమే కాకుండా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఈ నెల 1న  ములగుమూడలోని ఓ పాఠశాల సముదాయంలో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తమిళనాడు బీజేపీ నేతలు ఆరోపించారు.

దేశం కోసం మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాలంటూ యువతను రాహుల్ రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరామని బీజేపీ తమిళనాడు వ్యవహారాల బాధ్యుడు వి.బాలచంద్రన్ తెలిపారు.