తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కలకలం రేపుతోంది.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం అయిలాపూర్‌లో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
సకాలంలో స్పందించిన అధికారులు పాఠశాల విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
దీంతో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో స్పందించిన యాజమాన్యం పాఠశాలను మూసివేసింది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,254కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,707 మంది కోలుకున్నారు.
మృతుల సంఖ్య 1,635 చేరింది. ప్రస్తుతం 1,912 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.