గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ కానిస్టేబుల్‌

224
Constable caught moving Ganja

నేరాలను అడ్డుకోవల్సిన కొందరు పోలీసులు అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు. ఓ కానిస్టేబుల్‌ యదేచ్చగా గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడు.

అయితే కొంతకాలంగా గ్గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అతని అక్రమ దందాకు బ్రేక్ పడింది.

గంజాను స్మగ్లింగ్‌ చేస్తూ ఎక్సైజ్‌ అధికారులకు ఈ పోలీస్ రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు.

వివరాల్లోకి వెళితే సంజీవ్‌ హైరా అనే వ్యక్తి ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

గత కొంత కాలంగా ఛత్తీస్‌గఢ్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నాడు. అయితే మల్కాన్‌గిరిలోని బలిమెలలో ఆబ్కారీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఓ ట్రక్కు ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు మరో బృంధానికి సమాచారం అందించారు. కోరుకొండలో మాటువేసిన  అధికారులు ఆ ట్రక్కును అడ్డుకున్నారు.

అందులో 31 బస్తాల్లో ఎనిమిది క్వింటాళ్ల గంజాయి లభించిందని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అశోక్‌ కుమార్‌ సేథ్‌ తెలిపారు.

బహింగ మార్కెట్లో దాని విలువ దాదాపు రూ.40 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

ఆవ్యాన్‌ను కానిస్టేబులే స్వయంగా నడుపుతున్నాడని తెలిపారు. దీంతో ఆ కానిస్టేబుల్‌పై  కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.