గ్రూపులతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు.
గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు సరికాదని చెప్పారు.
నాయకులను టార్గెట్ చేసి పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ఈ మధ్య కాలంలో నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్లు తనకు తెలిసిందన్నారు.
అలాగే పార్టీని బలహీనపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని, పీసీసీ స్పందించకపోతే.. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని జానారెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఐక్యతగా పనిచేయాలని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నాయకుల మధ్య ఎవరికైనా బేదాభిప్రాయాలు ఉన్నచో పార్టీ ఫోరమ్స్‌లో చర్చించి, పరిష్కరించుకుని సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.