
వరంగల్: జిల్లా అధినేతగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్ ఆమ్రపాలికి కోర్టు ఝలక్ ఇచ్చింది.
ఆమ్రపాలి వినియోగిస్తున్న ఫార్చునర్ కారును జప్తు చేయాల్సిందిగా వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆదేశించారు.
ఐసీడీఎస్ భవనానికి సంబంధించి రూ. 3 లక్షలు అద్దె చెల్లించలేదంటూ కృష్ణారెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కృష్ణారెడ్డి వాదనలు విన్న న్యాయమూర్తి కలెక్టర్ కారును జప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కారును జప్తు చేసేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఆమ్రాపాలి కలెక్టర్‌గా విధులు చేపట్టాక అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పన విషయంలో ఆమ్రపాలి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆమె పనితనాన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం ఆమెకు వరంగల్ అర్బన్‌తో పాటు రూరల్ జిల్లా బాధ్యతలను కూడా అప్పగించింది. ఆమ్రపాలి ప్రస్తుతం రెండు జిల్లాలకు కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
కారు జప్తుపై స్పందించిన కలెక్టర్
కారు జప్తుపై కలెక్టర్ ఆమ్రపాలి స్పందించారు.
వారంలోగా అద్దె చెల్లించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ భవనానికి సంబంధించి రూ. 3 లక్షలు అద్దె చెల్లించలేదంటూ కృష్ణారెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
దీనిపై వాదనలు విన్న వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆమ్రపాలి వినియోగిస్తున్న ఫార్చునర్ కారును జప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమ్రపాలి వారంలోగా అద్దె చెల్లించాలని, దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.