తెలంగాణలో కోడి ధర మరోసారి కొండెక్కింది. బర్డ్‌ఫ్లూ లేదని, చికెన్ తినవచ్చని ప్రభుత్వం చేసిన ప్రచారంతో మళ్లీ చికెన్ కొనుగోళ్లు ఊపందుకొన్నాయి.
ఆదివారం రికార్డుస్థాయిలో రిటైల్ మార్కెట్‌లో కిలో 230 రూపాయలు పలికింది. చికెన్ అమ్మకాలు పడిపోవడంతో ధరలను తగ్గించిన వ్యాపారులు తాజాగా మళ్లీ అమ్మకాలు పుంజుకోవడంతో ధరలు పెంచేస్తున్నారు.
గత వారం రోజుల క్రితం చికెన్ ధర కిలో 140 రూపాయలు పలికింది. తిరిగి పెరుగూతూ ఆదివారం నాటికి 230 రూపాయలకు చేరింది. బర్డ్‌ఫ్లూ కేసులు రాష్ట్రంలో నమోదు కాకపోవడంతో కొనుగోలు దారులు ఊపరి పీల్చుకున్నారు.
మటన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలే కాకుండా అన్నివర్గాల ప్రజలుకూడా చికెన్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో వ్యాపారులు మళ్లీ ధరలు పెంచడం ప్రారంభించారు.
రాబోయే వేసవిలో ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారస్తులు చెబుతున్నారు.