కొత్త బండి కొనాలంటే ముందుగానే కొంత మొత్తం కట్టాల్సివుంటుంది. బండి కానాలని ఉన్నా ఇనిషియల్ పేమెంట్ దగ్గర ఆగిపోతారు.
అందులోనూ కరోనా వల్ల జీవనోపాధిని కోల్పోయి చాలా మంది రోడ్డున పడ్డారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ఉద్యోగాలు వస్తున్నాయి.
జనజీవనం గాడిలో పడుతోంది. అయితే బండి కొనేంత డబ్బులు చాలా మంది దగ్గర ఉండవు. ఇటువంటి వాళ్ల కోసమే హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఓ కొత్త పథకాన్ని తెచ్చింది.
ఇనిషియల్ పేమెంట్‌గా ఒక్క రూపాయి కూడా కట్టకుండా బండిని తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే అమ్మకాలు పెంచుకునేందుకు ఈ కంపెనీ 100 శాతం ఫైనాన్స్ ఇస్తోంది.
స్కూటర్ల రంగంలో మన దేశంలో హోండా యాక్టివ్ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో భారత్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ గత 20 ఏళ్లుగా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
వంద శాతం ఫైనాన్స్ ఇవ్వడంతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. అయితే ఈ అవకాశం ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉంటుంది.
హోండా ఎంపిక చేసుకున్న బ్యాంక్‌ల నుంచి మాత్రమే 100 శాతం ఫైనాన్స్ లభిస్తుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ పేమెంట్స్ ఎంచుకునేవారికి రూ.5,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
అది కూడా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అప్రూవ్ చేసిన బ్యాంకులకు చెందిన కార్డులకే వర్తిస్తుంది. డౌన్‌పేమెంట్ చెల్లించాలనుకునే వారికి కూడా ఆఫర్స్ ఉన్నాయి.
కనీసం రూ.2,499 డౌన్‌పేమెంట్ చెల్లించి హోండా యాక్టీవా 6జీని సొంతం చేసుకోవచ్చు. వడ్డీ 6.5 శాతం మాత్రమే. నగదు క్యాష్ బ్యాక్ లాంటివేమీ ఉండవు.
ఈ ఆఫర్స్ హోండా యాక్టీవా 6జీతో పాటు హోండా షైన్ 125సీసీ బైక్‌కి కూడా వర్తిస్తాయి.