తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు నినాదాలు మాత్రమే ఇస్తారని, హామీలు నెరవేర్చరని దుయ్యబట్టారు.
స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొస్తామని ఊదరగొట్టిన కేంద్రం.. ఇప్పటివరకు పైసా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
విభజన చట్టంలోని సంస్థలను కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని ఎన్‌ఐడీని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. కేంద్రాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అడిగితే ఇవ్వలేదన్నారు.
మోదీ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో సిలిండర్ ధర రూ. 400 ఉంటే.. ఇప్పుడు దాని ధర రూ. 800లకు పెరిగిందన్నారు. మోదీ హయాంలో పెట్రోల్ ధర కూడా సెంచరీ కొట్టేసిందన్నారు.
నల్లధనం తీసుకొస్తానని ఊదరగొట్టారు. విదేశాల నుంచి ఇప్పటి వరకు పైసా నల్లధనం తీసుకురాలేదు అని కేటీఆర్ దుయ్యబట్టారు. విభజన చట్టంలోని సంస్థలను కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 2 లక్షల 72 వేల కోట్లు కడితే.. కేంద్రం మాత్రం రాష్ర్టానికి చ్చింది రూ. లక్షా 40 వేల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.