
రాబోయే ఎనిమిది రోజులకు గాను ఐదు రోజులు బ్యాంక్‌లకు సెలవులు రానున్నాయి.
దీంతో బ్యాంక్ పనులు ఏవైనా ఉంటే ముందే చక్కదిద్దుకోండి. వివరాల్లోకి వెళితే.. గురువారం అనగా ఈ నెల 11న మహాశివరాత్రి సందర్భంగా బ్యాంకులు పని చేయవు.
తర్వాత 12వ తేదీన శుక్రవారం బ్యాంకులు యధావిధిగా పని చేస్తాయి. అయితే 13వ తేదీన రెండో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
మరుసటి రోజు 14న ఆదివారం సెలవు దినం. సోమ, మంగళవారం కూడా బ్యాంకులు పని చేసే పరిస్థితి లేదు.
ఎందుకంటే యూనైటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆ తేదీల్లో దేశ వ్యాప్త సమ్మెకు (Bank Strike) పిలుపునిచ్చింది.
బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు ఈ సమ్మెకు దిగనున్నారు. అంటే 15, 16 తేదీల్లో బ్యాంకులు పని చేయవు.
దీంతో బ్యాంకులకు దాదాపు వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి.
ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది.