
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు ఏపీ వ్యాప్తంగా బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ బంద్ లో బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ పాల్గొంటున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వామపక్షాలు, టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు.
బంద్ సందర్భంగా కళాశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. మద్దిలపాలెంలో వామపక్షాలు రోడ్డెక్కి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, లారీ యజమానుల సంఘాలతోపాటు ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు ప్రకటించింది.
బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్టాండ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట నుండి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి.