కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా బంపరాఫర్ ప్రకటించింది.
మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన పాపులర్ స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది.
హోండా యాక్టివా 125 స్కూటర్‌పై ప్రస్తుతం రూ.5 వేల క్యాష్ బ్యాక్ లభిస్తోంది. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్‌లో హోండా యాక్టివా కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్ వంటి కస్టమర్లకు ఈ ఆఫర్ ఉంది.
ఇక హోండా యాక్టివా మూడు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది.స్టాండర్డ్, అలాయ్, డీలక్స్ అనేవి వేరియంట్లు. యాక్టివా 125 ధర రూ.70,629 నుంచి ప్రారంభమౌతోంది.
గరిష్ట ధర రూ.77,752 వరకు ఉంది. ఈ ధరలు అన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ ధర ఇంకా ఎక్కువే ఉంటుంది.
ఈ స్కూటర్‌లో 124 సీసీ ఇంజిన్ ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్‌లో సింగిల్ సిలిండర్ ఎయర్ కూల్డ్ ఇంజిన్ అమర్చింది.
ఫ్రిక్షన్ రిడక్షన్ టెక్నాలజీ, హోండా ఎకో టెక్నాలజీ, ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.