
రాజస్థాన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం వైన్‌షాప్‌లను లాటరీలో కాకుండా వేలం వేయాలని నిర్ణయించారు.
దీంతో అక్కడి ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. నుమాన్‌గఢ్ జిల్లా నోహర్‌లోని ఓ వైన్‌షాప్‌కు ఈ-వేలం వేశారు.
గతంలో నిర్వహించిన లాటరీలో కేవలం రూ.65 లక్షలకే పోయిన ఈ వైన్‌షాప్ ఈసారి మాత్రం భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంది.
ఉదయం 11 గంటలకు మొదలైన ఈ ఈ-వేలం అర్ధరాత్రి 2 గంటలకు ముగిసింది.
చివరికి రూ.510 కోట్ల ధర పలకడం విశేషం. కిరణ్ కన్వర్ అనే వ్యక్తి ఈ షాప్‌ను సొంతం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
బేస్‌ప్రైస్ కంటే ఇది ఏకంగా 708 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. మూడు రోజుల్లో ఈ బిడ్డింగ్ మొత్తంలో రెండు శాతాన్ని బిడ్డర్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అతడు చెల్లించలేకపోతే రూ.లక్ష డిపాజిట్‌ను తిరిగి చెల్లించరు.