సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఆర్టీసీ బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి.
ఈ ఘటన జిల్లాలోని మునిపల్లి గ్రామంలో జరిగింది.విషయం తెలుసుకున్న డిస్కమ్ సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదమే తప్పింది.
మునిపల్లి మోడల్ స్కూల్ ఎదుట ఉన్న బస్టాప్ వద్ద విద్యార్థులను, ప్రయాణికులను ఎక్కించుకుని బస్సు సంగారెడ్డికి బయలుదేరింది.
ఆ సమయంలోనే ఆర్టీసీ బస్సుపై విద్యుత్ తీగలు తెగి పడడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై గాయపడ్డారు.
గాయపడిన వారిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.
మిగిలిన వారికి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు.