హంతకులు టీఆర్ఎస్ నాయకులే: రేవంత్ రెడ్డి

285
BJP will lose..Rewanth Reddy prophecy

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతులను దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

ఈ దారుణ హత్యపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. న్యాయాన్ని అన్యాయం నడిరోడ్డుపై నరికి చంపిందని ఆవేదన వ్యక్తం చేశారు.

హంతకులు టీఆర్ఎస్ నాయకులే అనే సాక్ష్యం కళ్లముందు ఉందని, వారిపై చర్యలేవి కేసీఆర్ అని ప్రశ్నించారు.

వామన్ రావు తన ప్రాణాలను కోల్పోయే ముందు తనపై దాడికి పాల్పడింది ఒక టీఆర్ఎస్ నాయకుడని చెప్పారు.

ఆయన పేరును వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వామన్ రావు హత్యకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. మంథని ప్రాంతంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్ గూండాయిజం పెరిగిపోయిందన్నారు.

పుట్ట మధుకర్ అన్యాయాలను ప్రశ్నించినందుకే హత్య చేశారని ఆరోపించారు. సాక్షాత్తు టీఆర్ఎస్ మండల ప్రెసిడెంటే ఈ హత్య చేశారంటే రౌడీయిజం ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతోందన్నారు.