హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య

272
high court advocate couple murder in peddapalli

పెద్దపల్లి లో పట్టపగలే దారుణం జరిగింది. కారులో హైదరాబాద్‌ కు వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల పై గుర్తు తెలియని దుండగులు దాడి కి పాల్పడ్డారు.

వీరిని కలవచర్ల పెట్రోల్‌ పంపు ఎదుట అడ్డుకున్న దుండగులు కారులో ఉండగానే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.

స్థానికుల సమాచారం తో 108 అంబులెన్సు లో పెద్దపల్లి ఆసుపత్రి కి తరలిస్తుండగా వారిద్దరూ మృతి చెందారు.

హత్యకు గురైన లాయర్‌ది మంథని మండలం గుంజపడుగు గ్రామం. తమ గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగింది.

విషయం తెలుసుకున్న పోలీసులు దుండగుల కోసం అన్ని చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.