నేటి నుంచి రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌

239
Covid-19 Vaccine Second Dose Telangana

దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కొవిడ్‌ టీకా రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ నేడు ప్రారంభమైంది. రాష్ట్రంలో 140 కేంద్రాల్లో టీకా పంపిణీ కొనసాగుతోంది.

మొదటి డోస్‌ తీసుకున్న చోటే రెండో డోస్‌ వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అలాగే మొదట ఏ కంపెనీ డోస్‌ తీసుకుంటే మళ్లీ అదే కంపెనీ వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యులు సూచించారు

తొలి డోసు తీసుకున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండో డోస్‌ టీకా ఇస్తున్నారు. గాంధీ హాస్పిటల్‌ డీఎంఈ రమేశ్‌రెడ్డి శనివారం రెండో డోస్‌ తీసుకున్నారు.

మొదటి డోస్‌ తీసుకోని సిబ్బంది ఈ నెల 25లోగా తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆ తర్వాత మొదటి డోస్‌ ఇచ్చే అవకాశం లేదని వైద్యా ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.