బీజేపీ నేత‌ల‌కు త‌గిన స‌మ‌యంలో బుద్ధి చెబుతాం: కేటీఆర్

211
no place for physical attacks in a democracy

బీజేపీ నేత‌ల‌కు త‌గిన స‌మ‌యంలో బుద్ధి చెప్తామ‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని పద్మనాయక కల్యాణమండపంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఏర్ప‌డ్డాయంటే అది కేసీఆర్ భిక్ష అని చెప్పారు.

ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర‌మంత్రుల‌ను కూడా వ‌దిలిపెట్టమన్నారు.తమ స‌హ‌నాన్ని అస‌మ‌ర్థత‌గా భావిస్తే చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు.

మాట‌లు మాట్లాడే ప‌రిస్థితి వ‌స్తే.. తాము మీ కంటే ఎక్కువ‌గా మాట్లాడుతామ‌ని హెచ్చ‌రించారు.

నాటి ముఖ్య‌మంత్రుల‌ను ఉరికించిన చ‌రిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు. .ఆ విష‌యాన్ని బీజేపీ నాయ‌కులు మ‌రిచిపోవ‌ద్దన్నారు.

ఈ 20 ఏండ్ల కాలంలో టీఆర్ఎస్ చ‌రిత్ర‌లో ఎన్నో విజ‌యాలు సాధించాం అని తెలిపారు.

ఈ రోజు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో 24 గంట‌ల విద్యుతు ఇస్తున్నామ‌ని తెలిపారు. దేశంలో 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్ర‌మే రైతుబంధు, రైతుబీమా, రుణ‌మాఫీల‌తో రైతుల‌ను ఆదుకొంటోందని అన్నారు.