కేసీఆర్ చిన్ననాటి స్నేహితుడు మృతి

204
KCR childhood friend dies

తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాల్య మిత్రుడు  తుదిశ్వాస విడిచారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన తిరునగరి సంపత్‌కుమార్‌ గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు.

కేసీఆర్, సంపత్‌కుమార్‌ చదువుకునే రోజుల్లో మంచి మిత్రులని గ్రామస్తులు తెలిపారు.

సీఎం హోదాలో కేసీఆర్‌ కొన్ని నెలల క్రితం కరీంనగర్‌కు వచ్చినప్పుడు ఉత్తర తెలంగాణ భవన్‌లో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకు సంపత్‌కుమార్‌ వెళ్లారు.

సంపత్‌కుమార్‌ను చూసి సీఎం చిరునవ్వుతో పలకరించి, ఆప్యాయతతో హత్తుకున్నారు.

అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు ఆయన సంపత్‌ను పరిచయం చేశారు.

హైదరాబాద్‌లో ఒకే గదిలో కలసి ఉన్న జ్ఞాపకాలను సీఎం గుర్తు చేయడంతో సంపత్‌కుమార్‌ ఆ రోజు సంతోషపడ్డారు.