సింగరేణి ఓసీపీ ఫోర్ ప్రాజెక్టు వలస దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించడానికి ఈరోజు మేడిపల్లి గ్రామానికి సింగరేణి అధికారుల బృందం కమిటీ SO to GM త్యాగరాజు,సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, ఎన్విరాల్ ఆఫీసర్ ఆంజనేయప్రసాద్,సివిల్ ఇంజినీర్ వెంకటేశ్వర్రావు, సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస రావు రావడం జరిగింది .
ఈ సందర్బంగా మూడ వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ గారు గ్రామంలో వాడవాడ తిరుగుతూ కూలిపోయినా, దెబ్బతిన్న ఇళ్లను అధికారుల బృందం కమిటీకి చూపించడం జరిగింది.
ఈ సందర్బంగా డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తప్పకుండా సింగరేణి యాజమాన్యం కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్లను మరమ్మతులు చేయించి, మేడిపల్లి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్బంగా అధికారుల బృందం కమిటీ మాట్లాడుతూ మేడిపల్లి గ్రామ ప్రజలు అధికారుల కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరిగింది, మేడిపల్లి గ్రామ ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.