రేషన్ పంపిణీ వాహనాలను త‌నిఖీ చేసిన నిమ్మ‌గ‌డ్డ!

175
SEC Nimmagadda

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్నికల నిబంధనలకు లోబడే రేషన్‌ వాహనాల ద్వారా స‌ర‌కుల‌ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు తెల‌ప‌డంతో ఆ దిశ‌గా ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో నిబంధ‌న‌ల అమ‌లుపై రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టి సారించారు. రేషన్‌ డెలివరీ వాహనాలను పరిశీలించారు.

పౌరసరఫరాల శాఖకు చెందిన రెండు వాహనలను ఎస్‌ఈసీ పరిశీలించారు. డ్రైవర్ కేబిన్‌లో కూర్చుని రేషన్ పంపిణీ వివారాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ పంపిణీ వాహ‌నాల‌ను ఎస్ఈసీ ప‌రిశీలించాల‌ని హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడలోని ఎన్నిక‌ల సంఘం కార్యాలయానికి ఆ వాహనాలను పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకురావ‌డంతో నిమ్మ‌గ‌డ్డ స్వ‌యంగా వాటిని త‌నిఖీ చేశారు. వాహనాలపై ఉన్న రంగులతో పాటు ఫొటోలను పరిశీలించారు. రేష‌న్ డెలివ‌రీ వాహనంలోని సదుపాయాల గురించి ఆయ‌న‌కు అధికారులు వివరించారు.