రైతుల నిరసనలపై కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం!

130
Kishan Reddy responds to Bhainsa clashes

 రైతుల నిరసనలతో దేశ రాజధాని న్యూఢిల్లీ సరిహద్దులు అట్టుడుకుతున్నాయి. దీంతో ఘాజీపూర్, చిల్లా, తిక్రి, సింఘూ సరిహద్దుల నుంచి ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు. ఈ విషయంపై కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పార్లమెంట్ లో ప్రస్తావించారు. శివసేనకు చెందిన సభ్యుడు అనిల్ దేశాయ్ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనల కారణంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందా? అని ప్రశ్నించగా హోమ్ శాఖ తరఫున కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

రైతుల నిరసన కారణంగా రాజధాని వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల వాసులు కూడా హస్తినకు రాలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. దీంతో దీంతో అత్యవసర పనుల నిమిత్తం హస్తినకు వచ్చే వారు రాలేక పోతున్నారని అన్నారని తానిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కిషన్ రెడ్డి తెలిపారు.