బాబు పేరు గూగుల్ …వరల్డ్స్‌ స్ట్రేంజెస్ట్‌ నేమ్‌

303

జకార్తా: ఇండోనేషియాకు చెందిన దంపతులు తమ కుమారుడికి వెరైటి కోసం గూగుల్‌ అని నామకరణం చేశారు. దీంతో ఆ చిన్నారికి వరల్డ్స్‌ స్ట్రేంజెస్ట్‌ నేమ్‌ అవార్డును తెచ్చిపెట్టింది. ఇటీవల ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ పేరును చట్టబద్ధంగా నమోదు చేయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు తమ కుమారుడికి ఇంటిపేరు లేకుండా, ముందూ వెనకా ఎలాంటి ఇతర పేర్లను జోడించకుండా ప్రముఖ సెర్చింజన్‌ ఐన గూగుల్‌ పేరును పెట్టారు.