మేష రాశి : ఈ రోజు పనుల విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కొంటారు. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఎక్కువసార్లు ప్రయత్నిస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యవిషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశముంది. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్యసమాచారం అందుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
మిథున రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపాల్సి రావటం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవటం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం.
సింహ రాశి : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది.
కన్య రాశి : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు. మధ్యాహ్నం తర్వాత కొంత మానసిక ఆందోళనకు గురవుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.
తుల రాశి : మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి, అనుకోని లాభాలు కానీ, మిత్రుల కలయిక కానీ జరుగుతుంది.
వృశ్చిక రాశి : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
ధనుస్సు రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస సంబంధ సమస్యలు కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.
మకర రాశి : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం.
కుంభ రాశి : ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. చిరకాల మిత్రులు కలుస్తారు. మంచి ఆహారం స్వీకరిస్తారు. భూసంబంధ లావాదేవిలు చేస్తారు.
మీన రాశి : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. నరాలు, కడుపుకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశముంటుంది. మీ జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. బంధువుల కారణంగా లేదా వాహనం కారణంగా డబ్బు ఖర్చవుతుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, పోటీ పరీక్షలు రాసే వారికి అనుకూలంగా ఉంటుంది.