వివాదంలో మహేష్‌ ఏయంబీ సినిమాస్‌

355
Mahesh Babu

సూపర్‌ స్టార్ మహేష్ బాబు ఇటీవల హైదరాబాద్‌లో ఏయంబీ సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ థియేటర్స్‌ లో సినిమా చూడాలంటే డబ్బు కూడా అదే స్థాయిలో ఖర్చు పెట్టాల్సిందే. తాజాగా ఈ మల్టీప్లెక్స్‌కు జీఎస్టీ అధికారులు నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై ఆ షోకాజ్ నోటీసు జారీ అయినట్టుగా తెలుస్తోంది.




 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 100కు పైగా టికెట్‌ ఉన్న థియేటర్లలో జీఎస్టీ రేటును 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. జనవరి 1 నుంచే ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అయితే ఏయంబీ సినిమాస్‌లో మాత్రం ఇంకా రేట్లు తగ్గించకుండా పాత రేట్లనే కొనసాగిస్తుండటంతో రంగారెడ్డి జిల్లా జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఏయంబీ సినిమాస్‌ పార్టనర్‌ అయిన సునీల్‌.. అధికారులు తనిఖీలు నిర్వహించిన మాట వాస్తవమే గాని, నోటీసులు ఇవ్వలేదని, తెలిపినట్టుగా తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్‌ను ఏసియన్‌ గ్రూప్‌తో కలిసి మహేష్‌ బాబు నిర్వహిస్తున్నారు.