2019 ఎన్నికలు దగ్గర పడుతున్నందున రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పలువురు నేతలు ఉన్న ఫలంగా రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి వేరే పార్టీల్లోకి జారుకుంటున్నారు…ఈ క్రమంలో తాజాగా కరీంనగర్ నేత బండి సంజయ్ బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు…
బీజేపీలో అనేక సేవలు చేసినా… తనను పార్టీ నేతలు గుర్తించలేదని.. అందుకోసమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ స్పష్టం చేశారు. తాను కరీంనగర్ సమస్యలను చెప్పుకునేందుకు అనేక సార్లు హైదరాబాద్ కు వస్తే అక్కడ పార్టీ కార్యకర్తలు తనను తీవ్రంగా అవమానించారని సంజయ్ తెలిపారు.. నిరంతరం పార్టీ కోసం సేవలు చేసి, ఆరోగ్యం పాడుచేసుకుని జైలుకు వెళ్లినా కూడా తనకు న్యాయం జరగలేదన్నారు…
సంజయ్ తన అనుచరులతో కలిసి ఆదివారం నాడు తెలంగాన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌తో భేటీ అయ్యారు. పార్టీని వీడొద్దని, భవిష్యత్తులో న్యాయం చేస్తామని లక్ష్మణ్ బుజ్జగించినా …వినకుండా తనకు జరిగిన అవమానంతో పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు సంజయ్.