నగరం లో ఈ రోజు (ఫిబ్రవరి 5)

251
todays-programs-hyderabad-february-5

బిరుదు ప్రదానం

కార్యక్రమం: తెలంగాణ ఆర్యవైశ్య అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మాడుగుల నాగఫణి శర్మచే తెలంగాణ ఆర్యవైశ్యమహాసభ ప్రథమ అధ్యక్షుడు అమరవాదికి ‘అభినందన మందార మాల’ ‘ఆర్యవైశ్య ఆణిముత్యం బిరుదు ప్రదానం.
ముఖ్యఅతిథి: మాజీ గవర్నర్‌ కె.రోశయ్య
గౌరవ అతిథులు: బిగ్గాల గణే్‌షగుప్తా (ఎమ్మెల్యే, నిజామాబాద్‌), కోలేటి దామోదర్‌ గుప్తా (చైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌), బోల్లం సంపత్‌కుమార్‌ (చైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్‌).
స్థలం: రవీంద్రభారతి
సమయం: ఉదయం 10గం.

ఎక్స్‌పో

కార్యక్రమం: సౌత్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ బ్యూటీ అండ్‌ స్పా ట్రేడ్‌ ఎక్స్‌పో.
స్థలం: జలవిహార్‌, నెక్లె్‌సరోడ్‌.
సమయం: ఉదయం 10గం.

సమావేశం

కార్యక్రమం: బైబిల్‌ను దహనం చేసి, పాస్టర్లపై దాడిచేసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలిండియా ట్రూ క్రిస్టియన్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో సమావేశం.
స్థలం: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌
సమయం: మధ్యాహ్నం 1గం.

ఘంటసాల గీతామృతం

కార్యక్రమం: సద్గురు ఘంటసాల స్మృతికేంద్రం, వంశీ వేగేశ్న సేవాశ్రమం ఆధ్వర్యంలో ఘంటసాల గీతామృతం.
ముఖ్యఅతిథి: ప్రముఖ గాయకుడు కేబీకే మోహన్‌రాజు
స్థలం: ఘంటసాల గుడి, కుంట్లూరు. అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం.
సమయం: ఉదయం 8గం.

సినీ సంగీత విభావరి

కార్యక్రమం: జీపీఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘మధుర గాన రమణీయం’ సినీ సంగీత విభావరి. సి. రమణకు ఆత్మీయ సత్కారం, బిరుదు ప్రదానం.
ముఖ్యఅతిథి: ఆచార్య ఎల్లూరి శివారెడ్డి( తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు), విశిష్టఅతిథి: డాక్టర్‌ ఎ.విజయకుమార్‌
సభాధ్యక్షుడు: సీహెచ్‌ త్రినాథరావు (ప్రముఖ గాయకుడు)
ఆత్మీయ అతిథులు: కళావీఎస్‌ జనార్దనమూర్తి, యలవర్తి రాజేంద్రప్రసాద్‌, అర్చన వెంకటేశ్వరావు, కలగా కృష్ణమోహన్‌.
స్థలం: త్యాగరాయగానసభ.
సమయం: సాయంత్రం 4.30గం.

ఆత్మీయ సత్కారం

కార్యక్రమం: రాగరాగిణి ఆర్ట్స్‌ అసోసియేషన్‌, త్యాగరాయగానసభ, తరుణ సాహితీ సమితి ఆధ్వర్యంలో పోలా ప్రగడ రాజ్యలక్ష్మి జన్మదినం సందర్భంగా డాక్టర్‌ అక్కిరాజు మంజుశ్రీ, పీఎ్‌సఆర్‌ ప్రసాదరావుకు ఆత్మీయ సత్కారం. పోలా ప్రగడ రాజ్యలక్ష్మి రచించిన రచించిన ‘మధుర భక్తి గీతాలు’ సీడీ ఆవిష్కరణ.
స్థలం: కళాసుబ్బారావు కళావేదిక, త్యాగరాయగానసభ.
సమయం: సాయంత్రం 6గం.

హరికథా మహోత్సవాలు

కార్యక్రమం: డాక్టర్‌ కేవీ రమణ (ఐఏఎస్‌) జన్మదినోత్సవం సందర్భంగా ‘హరికథా మహోత్సవాలు’
స్థలం: ఘంటసాల కళావేదిక, రవీంద్రభారతి
సమయం: సా. 6 ( ఈ నెల 7 వరకు)

ఎగ్జిబిషన్‌

కార్యక్రమం: వాల్‌ హార్ట్స్‌ డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌ ఇనిస్టిట్యూట్‌ వార్షికోత్సవం సందర్భంగా కిడ్జీ అల్వాల్‌ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌
స్థలం: స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ
సమయం: ఉదయం 10.30గం.
(నేటివరకు)

ఆస్ర్టోనొమికల్‌ మీట్‌..

కార్యక్రమం: నేషనల్‌ అస్ర్టోనొమికల్‌ మీట్‌, వర్క్‌షాప్‌లు ప్రారంభం. (9వరకు)
స్థలం: పీజీఆర్‌ఆర్‌సీడీఈ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌, ఉస్మానియా యూనివర్సిటీ.
సమయం: ఉదయం 11గం.

మీ సభలు, సమావేశాలకు సంబంధించిన సమాచారం,
ఆహ్వాన పత్రికలు పంపాల్సిన చిరునామా: info@teenmaar.news