సమస్యల సాధన కోసం పాదయాత్ర

296
tpus-padayatra-kondagattu-employees-problems

తెలంగాణా ప్రైవేటు ఉద్యోగుల సంఘం తమ సమస్యల సాధన కోసం శనివారం కరీంనగర్ లోని విద్యానగర్ వెంకటేశ్వర ఆలయం నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్ర ను సంఘం రాష్ట్ర అద్యక్షుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సామ వెంకట్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సంఘం నేతలు మాట్లాడుతూ తెలంగాణా సాధన లో అగ్ర భాగాన నిలిచిన తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం తెలంగాణా సాధించుకున్న తర్వాత కూడా ప్రైవేటు ఉద్యోగుల సమస్యల పై పోరాడటం శోచనీయమన్నారు. తమ సమస్యల పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేసారు.

కార్యక్రమం లో జిల్లా అద్యక్షుడు ముడుంబై కార్తీక్ , రాష్ట్ర ప్రచార కార్యదర్శి యాస శోభన్ రెడ్డి, నాయకులు నగేష్ చారి, భాస్కర్ రావు , కె . రాజేందర్, ఆర్. సత్యనారాయణ , నాగసముద్రం పురుషోత్తం, చేన్నోజు రాజేందర్, శ్రీపతి మారుతీ, నక్షత్రం శ్రీనివాస్, అక్కపెళ్ళి గిరి ప్రసాద్, అక్క పెళ్లి శేఖర్, తాండ్ర శంకర్ బాబు, రఘునాథ్ , సదానందం. తిరుపతి, సాదు శ్రీనివాస్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.