25 డిసెంబర్ 2018 మంగళవారం మీ రాశి ఫలాలు

395
today rashi phalalu

మేషం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతీ సంబంధ సమస్యలు ఉండే అవకాశమున్నది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం : ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రావలసిన బకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

మిథునం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదులకుండా ప్రయత్నించండి. విజయం చేకూరుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.

కర్కాటకం : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

సింహం : ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, అలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయకండి.

కన్య : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

తుల : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలోవిదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం : ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతీ సంబంధ అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యానికి గురవుతారు. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకొనే అవకాశముంటుంది.

ధనుస్సు : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించడం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కొనే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనుకూలం.

మకరం : మీ జీవిత భాగస్వామితో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. మీ మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు తొలిగిపోతాయి. గృహ సంబంధ విషయాల్లో జరుగుతున్న ఆలస్యం తొలిగిపోతుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

కుంభం : ఈ రోజు మీ వృత్తిలో శుభపరిణామాలు ఏర్పడుతాయి. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. కోర్టు కేసులు లేదా వివాదాల్లో నుంచి విజయం, ఉప శమనం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తల, మెడ నొప్పులు బాధించవచ్చు.

మీనం : ఈ రోజు అనుకోని ఖర్చులతో ఆర్థికంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. పోటీలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం విషయంలో అనుకూల ఫలితాలు వస్తాయి.