హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు కోదండరాం సమక్షంలో గురువారం పలువులు నేతలు, ఉద్యమకారులు టీజేఎస్‌లోకి చేరారు. టీజేఎస్‌లో చేరినవారిలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జీతం నిలిపివేతకు గురైన ట్రెజరీ మాజీ అధికారి, ట్రెజరీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గడ్డం అంజ య్య తదితరులు ఉన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరినా.. అక్కడ పనితీరు నచ్చక వైదొలగానని, టీజేఎస్‌లో చేరుతున్నానని ఈ సందర్భంగా జంగయ్య ప్రకటించారు. ఈ సందర్భం గా కోదండరాం మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. టీజేఎస్‌లో చేరినవారిలో రాజ్యలక్ష్మి, సూరాజ్ కాపు, తదితరులు ఉన్నారు. హైదరాబాద్‌లోని వివిధ డివిజన్లవారిగా కూడా పలువురు టీజేఎస్‌లో చేరారు.