ఇటీవలీ కాలంలో ఏపీలోని పలు ఆలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా అలాంటి తరహాలో ఓ దాడి జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో మత విశ్వాసాలను దెబ్బతీసే దారుణ సంఘటన చోటుచేసుకొంది.
ఆలయంలోని విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. నవీపేట మండలం ధర్యాపూర్‌లో ఈ సంఘటన జరిగింది.
గ్రామంలో ఎంతో కాలం నుంచి మహాలక్ష్మి మందిరం ఉంది.
ఈ మందిరంలోని చిలుకమ్మ, మంగమ్మ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితులను వెంటనే పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.