కామినేని రాజీనామాపై కత్తి సంచలన ట్వీట్

331
kathi mahesh tweets on kamineni

ప్రత్యేక హోదా విషయంలో వరుస ట్వీట్స్ చేస్తున్నారు కత్తి మహేష్. తాజాగా కామినేని శ్రీనివాస్ రాజీనామాపై మహేష్ సంచలన ట్వీట్ చేశారు. ‘‘శ్రీ కామినేని గారి రాజీనామాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి పసికందులు మరణించిన వైభవ శకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య రంగంలో ముగిసిందని భావిస్తున్నాను. చంద్రబాబు గారికి అభినందనలు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.



నిన్న(శుక్రవారం) ఓ ట్వీట్‌లో తన దృష్టిలో ఈ నలుగురే నిజమైన హీరోలంటూ పేర్కొని సంచలనం సృష్టించారు. ‘‘సంపూర్ణేష్ బాబు, నిఖిల్ నిజమైన హీరోలు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకూ స్పందించిన శివాజీ, పవన్ కల్యాణ్ మినహా మిగతా ఏ హీరో కూడా నిజ జీవితంలో ప్రజల కోసం కనీసం మాట, ఒక ట్వీట్, ఒక ఉద్యమ అడుగు వెయ్యలేదు. కాబట్టి ప్రస్తుతానికి నా దృష్టిలో ఈ నలుగురే హీరోలు’’ అంటూ ట్వీట్ చేశారు.