ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు (శుక్రవారం-23) ఆయన ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… ఈనెల 28వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1423 పరీక్షా కేంద్రాలు, 48 సెల్ఫ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 10,26,891 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.
కాగా.. 116 సమస్యాత్మక కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ కేంద్రాలతో పాటు అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఎటువంటి సందేహాలు ఉన్న ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఫోన్ నెం: 0866-2974130కు సందేహాలున్నవారు ఫోన్ చేయవచ్చన్నారు. అంతేగాక పరీక్షా కేంద్రాలను సులువుగా తెలుసుకునేందుకు అందుబాటులోకి ఐపీ సెంటర్ లొకేటర్ యాప్ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఫీజులు చెల్లించలేదన్న కారణంతో హాల్ టికెట్లు నిలిపివేస్తే సహించమని మంత్రి తెలిపారు.