ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి..మహిళతో మంత్రి రాసలీలలు!

257
Former Minister of Karnataka in tears

ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను లోబరుచుకొని కర్ణాటక మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీల వీడియో వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగంపేరుతో నమ్మించి మంత్రి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఓ మహిళ ఆరోపించారు.

ఆ దృశ్యాల వీడియోను సమాచార హక్కు చట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి అందించారు.

ఆయన ఆ వీడియో సీడీని కొన్ని టీవీ చానళ్లకు పంపించారు. మహిళను మోసగించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్‌ను దినేశ్ కోరారు.

రాసలీలల వీడియోపై కర్ణాటక మంత్రి స్పందించారు. ఆ సీడీలో ఉన్నది తాను కాదని అన్నారు.

తన ఫొటోలను ఉపయోగించి ఎవరో ఈ సీడీని రూపొందించారని ఆరోపించారు.దీనిపై విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు.

కేసును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి తప్పు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.