షర్మిలను కలిసిన టాలీవుడ్ యాంకర్

216
Tollywood anchor met Sharmila

తెలంగాణలో మరో కొత్తపార్టీ త్వరలో ఆవిర్భవించనుంది. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్‌ సోదరి వైఎస్ షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ ఆత్మీయ సమావేశాలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ క్రమంలో పలువురు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు షర్మిలను కలిసి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పలువురు నేతలు షర్మిలతో భేటీ అయ్యారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల షర్మిలను కలిశారు.

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు తన భర్త న‌ర‌సింహా రెడ్డితో కలిసి వెళ్లిన శ్యామల వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు.

షర్మిల నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అక్కడి  సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు.