భర్తను బండరాళ్లతో కొట్టి చంపిన భార్య

188
Father killed daughter went boyfriend

మద్యం మత్తులో కట్టుకున్న భర్తనే హతమార్చింది  ఓ భార్య. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది.

వివరాల్లోకి వెళితే చాంద్రాయణగుట్టలో ఉండే రేష్మ, మొహమ్మద్ సోహైల్‌లు భార్యభర్తలు. వీరిద్దరూ సోమవారం ఓ చిన్న విషయంలో గొడవపడ్డారు.

అది మనసులో పెట్టుకున్న రేష్మ, మద్యం సేవించింది. మద్యం మత్తులో భర్తను బండరాళ్లతో కొట్టి చంపింది. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలోని  రహదారిపై ఈ ఘటన జరగడం గమనార్హం.

అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్లాస్టిక్ కాగితాలతో కాలబెట్టేందుకు ప్రయత్నం చేసింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రేష్మను అదుపులోకి తీసుకున్నారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.