కాలేజీ లో ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

191
Engineering student commits suicide in college

కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఇంజనీరింగ్‌ విద్యార్థి కె. జయంత్‌రెడ్డి (22) ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంఘటన బెంగళూరు విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరీయగింది.

వివరాల్లోకి వెళితే మృతుడు బెంగళూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బీఐటీ) అనే ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ రెండో ఏడాది చదువుతున్నాడు.

సోమవారం గత ఏడాది పెండింగ్‌ ఉన్న పరీక్ష రాయడానికి కాలేజీకి వచ్చాడు. ఫీజు బకాయిల్ని చెల్లించాలని కాలేజీ సిబ్బంది జయంత్‌రెడ్డిని నిలదీసినట్లు సమాచారం.

పరీక్ష ప్రారంభం కావడానికి ముందు అతను డెత్‌నోట్‌ రాసి కాలేజీ భవనం 7వ అంతస్తుపైకి వెళ్లి అక్కడ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనతో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి ధర్నాకు దిగారు. ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కావడం లేదని, ఇలాంటి సమయంలో పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు.

చదువుల్లో ఎంతో ప్రతిభావంతుడైన జయంత్‌రెడ్డి ఆత్మహత్యకు యాజమాన్య నిర్వాకమే కారణమని ఆరోపించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.