త్వరలో తెలంగాణ లో 20 కొత్త మునిసిపాలిటీలు

278
20-new-municipalities-telangana-state

రాష్ట్రంలో 20 కొత్త మున్సిపాల్టీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. జనగామ జిల్లాలో ఘన్‌పూర్, జగిత్యాల జిల్లా నుంచి ధర్మపురి, రాయికల్, పెద్దపల్లి జిల్లా న్యాయవ్యవస్థలో నుంచి మంథని, సుల్తానాబాద్, ఖమ్మం జిల్లాలో వైరా, ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్, నిర్మల్ జిల్లా లో తిమ్మాపూర్, కొమరం భీం జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, నిజామాబాద్ జిల్లాలో భీంగల్, డిచ్‌పల్లి ఉన్నాయి. మెదక్ జిల్లాలో రామాయం పేట, నర్సాపూర్, తుఫ్రాన్ కొత్త మున్సిపాల్టీలు కానున్నాయి. యాదాద్రి జిల్లాలో పోచంపల్లి, యాదగిరిగుట్ట, మోత్కూర్, చౌటుప్పల్, ఆలేరు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో భూత్పూర్, మక్తల్ ఉన్నాయి. గద్వాల జిల్లాలో అలంపూర్, వడ్డేపల్లి, వనపర్తి జిల్లాలో పబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు కొత్త మున్సిపాల్టీలు కానున్నాయి. ఆయా ప్రతిపాధనలను ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్రంలో మరో 20 కొత్త మున్సిపాల్టీలు ఏర్పడే అవకాశం ఉంది.