ఫేస్బుక్ ట్విట్టర్ తోనూ ఇండెన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్

989
indane gas refilling with facebook or twitter

సాంకేతికతను ఉపయోగించుకుని వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) ఓ వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో గ్యాస్ బుకింగ్ మరింత సులభం కానుందని పేర్కొంది. ఇకపై గ్యాస్ బుకింగ్ కోసం ఆఫీస్ కి వెళ్లడమో , ఫోన్ చేసి బుక్ చేసుకోవటమో కాకుండా సింపుల్ గా తమ గ్యాస్ సిలిండర్లను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఐన – ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

ప్రధాని నరేంద్రమోడీ డిజిటైజేషన్ ను ప్రోత్సహించటం తో , ఐఒసి కొత్త డిజిటల్ బుకింగ్ సేవను ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా రిఫిల్ బుకింగ్ ను ప్రవేశపెట్టి, వినియోగదారులకు అదనపు సౌకర్యం కల్పించింది.

ఇండెన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్ ఫేస్బుక్ ద్వారా చేయు వారు మొదటగా

  • Facebook లోకి లాగిన్ అవ్వాలి.
  • IOCL యొక్క అధికారిక ఫేస్బుక్ పేజికి వెళ్ళండి
  • ఇప్పుడు ‘బుక్ నౌ’ అనే బటన్ పై క్లిక్ చేయండి
  • ఇండెన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్ ట్విట్టర్ ద్వారా చేయు వారు
  • ట్వీట్ రీఫిల్ @indanerefill
  • మొదటిసారి రిజిష్టర్ ట్వీట్ కోసం LPGID

IOC ఉత్పత్తులను పొందేందుకు వినియోగదారులకు సరళమైన మరియు సమర్థవంతమైన ఎంపికలను అందించేందుకు సాంకేతికత మరియు పెరుగుతున్న సామాజిక మీడియాల అవసరం వుందని IOCL మార్కెటింగ్ డైరెక్టర్ Gurmeet Singh తెలియజేసారు.

2018 నాటికి ఇంధనం పై ప్రభుత్వ రాయితీలను తొలగించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) జులై 2017 నుంచి ప్రతినెల 1 వ తేదీన పెట్రోలు ధర పెంచింది. సబ్సిడైజుడ్ ఎల్పిజి ధర ప్రభుత్వ యాజమాన్య సంస్థల ధరల నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 1 న సిలెండరు కు 4.50 రూపాయల మేర పెరిగి 495.69 రూపాయలకు చేరుకుంది.

మార్చి నెలాఖరు నుండి అన్ని సబ్సిడీలను నిర్మూలించేందుకు ప్రతి నెలా ధరలను పెంచేందుకు ప్రభుత్వేతర చమురు కంపెనీలను గత ఏడాది ప్రభుత్వం కోరింది. గత సంవత్సరం జూలై నుంచి నెలవారీ పెరుగుదల విధానాన్ని అమలుచేసినప్పటి నుంచి సబ్సిడీ ఎల్పిజి రేట్లను రూ. 76.51 చొప్పున పెరిగాయి. . జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర రూ .419.18 వద్ద ఉంది.

ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రాయితీ రేట్లతో 12 సిలిండర్లకు (14.2-కిలోల) అర్హులు. అది మించి ఏవైనా అవసరం వుంటే అదనపు సిలిందర్ ని మార్కెట్ ధర వద్ద కొనుగోలు చేయాలి. మొదట్లో ఎల్పిజి ధర నెలకి రూ. 2 గా నమోదైంది. గత ఏడాది మే నుంచి రూ. 3 వరకు పెరిగింది. చమురు మంత్రిత్వశాఖ ప్రతి నెలా సిలిండరుకు నాలుగు రూపాయల చొప్పున పెంచుతుంది.