అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించాం: మంత్రి ఎర్రబెల్లి

407
erraballi TRS

ఉపాధి హామీ పథకంలో భాగంగా అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ క్యాలెండర్‌-2021 ని ఖైరతాబాద్ లో గల తన కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో నగరాలు, పట్టణాల నుంచి పల్లెల కు వాపస్ వలస వచ్చిన వాళ్లందరికి ఉపాధి కల్పించడం ఓ రికార్డ్ అన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో అత్యంత విజయవంతంగా నిర్వహించారని కొనియాడారు. తెలంగాణను దేశంలో నెంబర్ వన్‌గా నిలిపిన అధికారులు, ఉద్యోగులు, ఉపాధి కూలీలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అత్యధికంగా 18కోట్ల పని దినాలను పూర్తి చేసిన ఘనత తెలంగాణది అన్నారు. ఈ ఘనత మన అందరిదని కొనియాడారు. దీన్ని సాధించిన తీరు అమోఘమని మంత్రి ప్రశంసించారు.