యూనివర్సిటీ హాస్టల్స్ ను వెంటనే పున:ప్రారంభించాలి

161
hostels should be reopened immediately

గత 11 నెలలుగా రాష్ట్రంలోని అన్నీ యూనివర్సిటీలను మూసివేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను ప్రారంభించాలని చెప్తూనే మరో వైపు యూనివర్సిటీ హాస్టల్స్ ప్రారంభించకుండా విద్యార్థుల పై కక్ష్య సాధింపు చర్యలు చేయడం సిగ్గు మాలిన చేష్టలను నిరసిస్తూ వెంటనే హాస్టల్స్ ప్రారంబించాలని ఓయూ ఆడ్మినిస్టేషన్ బిల్డింగ్ మూసివేసి ABVP ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు హాస్టల్స్ లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓయూ అధికారులు మాత్రం పటించుకోకపోవడం దారుణం అని, హాస్టల్స్ ఓపెన్ చేసే వరుకు అడ్మినిస్ట్రేషన్ బంద్ చేస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు.

వీరిలో ఏబీవీపీ జాతీయ కార్యసమితి సభ్యులు పి. శ్రీహరి, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీశైలం వీరమల్ల, రాష్ట్ర నాయకులు సుమన్ శంకర్, జీవన్, సురేశ్, శివ తదితరులు పాల్గొన్నారు.