విపక్ష సభ్యుల ఆందోళన.. రాజ్య‌స‌భ రేపటికి వాయిదా!

342
Venkaiah Naidu

పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ చట్టాలపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. రైతు చట్టాలపై చర్చకు పట్టుబడుతూ రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. రాజ్య‌స‌భ‌లో రేప‌టి నుంచి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ త‌న ప్ర‌సంగంలో రైతు ఆందోళ‌న‌ల గురించి మాట్లాడార‌ని అన్నారు. సభా కార్యక్రమాలు నిలిపివేసి తక్షణమే వ్యవసాయ చట్టాలపై చర్చ చేపట్టాలని వారు స్పష్టం చేశారు. చైర్మన్ వెంకయ్యనాయుడు వారి డిమాండును తిరస్కరించారు.

సాగు చ‌ట్టాల‌పై స‌భ‌లో గ‌తంలోనే చ‌ర్చించామ‌ని, చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని త‌ప్పుడు సంకేతాలు ఇస్తున్నార‌ని, ఓటింగ్ అంశంలో ఆయా పార్టీల‌కు ప్ర‌త్యేక అభిప్రాయాలు ఉంటాయ‌న్నారు. రేపటి నుంచి రైతుల సమస్యలు చర్చిద్దామని చెప్పినా, విపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.