టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హెచ్చార్సీలో ఫిర్యాదు!

603
challa Darmareddy TRS

ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు నమోదు అయ్యింది. ఎమ్మెల్యేపై జాతీయ బీసీ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేష్ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. హన్మకొండలో ఏర్పాటు చేసిన ఓసీల ఘర్జనలో చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల బీసీ జాతీయ సంఘం మండిపడింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి.

బీసీ, దళిత వర్గాల ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతీసిన ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. బీసీ, దళిత వర్గాల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మళ్ళీ రాజకీయంగా పోటీ చేయకుండా అభిశంసన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బడుగు బలహీన వర్గాలపై ప్రేమ ఉంటే ఎమ్మెల్యేను వెంటనే బర్తరఫ్ చేయాలని కుల సంఘాలు డిమాండ్ చేశాయి.