
ఇంట్లో గొడవ పెట్టుకొని భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఈ ఘటన హైద్రాబాద్ నగరంలోని కాచిగూడ పరిధి గోల్నాకలో చోటుచేసుకుంది.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని కోనేటి శివకుమార్‌గా గుర్తించారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
శివకుమార్‌కు ఆరేళ్లక్రితం వివాహమైంది. గోల్నాకలో నివసిస్తూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
దంపతులకు సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.
ఈ క్రమంలో గొడవలు పెరిగి భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురై ఉరేసుకుని చనిపోయాడు.
సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.