పుచ్చకాయ ప్రొటెస్ట్ – ఎఫ్‌బీలో అమ్మాయిల నగ్న చిత్రాలు

1120
watermelon protest woman posted their nude images facebook

అమ్మాయిల వస్త్రధారణపై ఓ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. కాలేజీలో ముస్లిం విద్యార్థినులు బుర్ఖాను సరిగ్గా ధరించుకోవట్లేదని, వక్షోజాలు కనిపించేలా ఆ బట్టలేసుకోవడమేంటని, బయట రోడ్డుపై పుచ్చకాయ ముక్కల్లా ఏంటా చూపించడం అని మండిపడ్డారు.

కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జౌహర్ మున్నావిర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం పద్ధతులకు విరుద్ధంగా బట్టలు వేసుకుంటున్నారని అన్నారు. ముస్లిం కుటుంబాల సమావేశంలో భాగంగా మాట్లాడిన ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కొందరు ఫేస్‌బుక్‌లో తమ నగ్న ఫొటోలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.



 

ఇక, ఫరూక్ ట్రైనింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు చేతుల్లో పుచ్చకాయలు పట్టుకుని కాలేజీ ముందు ఆందోళన నిర్వహించారు. అంతేగాకుండా పుచ్చకాయ ముక్కల్ని పంపిణీ చేశారు. పలు జిల్లాల్లో యువతులు తమతమ ఫేస్‌బుక్‌లో తమ నగ్న ఫొటోలను పెట్టారు.

తిరువనంతపురానికి చెందిన ఆరతీ ఎస్ఏ అనే మహిళ కూడా తన నగ్న చిత్రాలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి నిరసన వ్యక్తం చేసింది. ఆమెకు ఆమె భర్త కూడా మద్దతునివ్వడం కొసమెరుపు.

‘‘మహిళల వక్షోజాలపై జనం ఇంత రచ్చ చేయడం అసహనాన్ని కలిగించింది. కాలేజీలో ప్రొఫెసర్లు కావొచ్చు.. సోషల్ మీడియా యూజర్లు కావొచ్చు.. అదేంటో మేగజీన్‌పై బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న ఫొటోపైనా విమర్శలు చేశారు. కాబట్టి నేను, నా భర్త నా నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను. నా వక్షోజాలు అందంగా ఉన్నాయని చెప్పి.. నన్ను, నా శరీరాన్ని వశపరచుకోవాలనుకోవడం పొరపాటు’’ అని ఆమె పేర్కొంది.

ఇక, దియా సానా అనే కొచ్చికి చెందిన కార్యకర్త.. తన స్నేహితురాలు పుచ్చకాయలు పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేసి.. ‘‘కప్పుకోండి..కప్పుకోండి.. మొహాన్ని, వక్షోజాలను పూర్తిగా కప్పేసుకోండి’’ అంటూ పోస్ట్ చేసింది. ప్రొఫెసర్లు మొహాలు చూసి పాఠాలు చెప్పాలి గానీ, తమ శరీరాలు చూసి కాదని పలువురు విద్యార్థినులు అన్నారు. ఎస్ఎఫ్ఐ సాయంతో ధర్నా చేశారు. రోడ్లపై ర్యాలీలు నిర్వహించారు.


ప్రొఫెసర్ ప్రసంగం వీడియో వైరల్…

ప్రొఫెసర్ ఎప్పుడు ఎక్కడ ఆ విషయంలో ప్రసంగించారన్న దానిపై స్పష్టత లేదు గానీ.. ఆ వ్యాఖ్యలు మాత్రం నిజమే. ముస్లిం యువతులు బుర్ఖా ధరిస్తున్నా.. శరీరంలోని కొన్ని కొన్ని అవయవాలు కనిపిస్తున్నాయని ప్రొఫెసర్ జొవాహర్ మున్నావిర్ వ్యాఖ్యానించారు. బుర్ఖా వేసుకునేటప్పుడు వక్షోజాలను సరిగ్గా కప్పి ఉంచుకోవాలని, లేదంటే మగాళ్ల చూపు అక్కడికే వెళుతుందని అన్నారు. కానీ, పలువురు ముస్లిం యువతులు మాత్రం మొహాన్ని మాత్రమే కప్పేస్తూ.. మిగిలిన శరీరం మొత్తం చూపించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఆయన పుచ్చకాయలతో పోలిక పెట్టారు. ‘‘మీరు పుచ్చకాయ చూసే ఉంటారు కదా. కస్టమర్లను ఆకర్షించేందుకు దుకాణాలు, రోడ్ల మీద బండ్లపై పుచ్చకాయలను కోసి డిస్ప్లే పెడుతుంటారు. అలా అయితే, కస్టమర్లు వస్తారని వారి అభిప్రాయం. ఇక్కడ మహిళలు, యువతులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు’’ అని మున్నావిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.