ఐటీ ఆఫీసులకు సెలవులు లేవు

276
no holidays for IT offices

ఆదాయ పన్ను శాఖ ఆఫీసులు ఈనెల 29, 30, 31 తేదీల్లోనూ తెరుచుకోనున్నాయి. ప్రస్తుత వార్షిక సంవత్సరం ముగింపు కానున్న నేపథ్యంలో కార్యాలయాలను తెరిచి ఉంచనున్నట్లు అధికారులు చెప్పారు. పన్నుదారులు యధావిధిగా తమ ఫైలింగ్ రిటర్న్స్‌ను దాఖలు చేసుకోవచ్చని వెల్లడించారు. 

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీ ఆఫీసులు ఈ మూడు రోజుల్లోనూ తెరిచి ఉంటాయని ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. వాస్తవానికి మార్చి 29న మహావీర్ జయంతి, మార్చి 30వ తేదీన గుడ్‌ఫ్రైడే సెలవులు ఉన్నాయి. మార్చి 31వ తేదీన 2017-18 ఆర్థిక సంవత్సర చివరి తేదీ కావడం విశేషం. ఈ మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులను మూసివేయనున్నారు.