టీఆర్ఎస్‌కు ఓటేస్తే చెప్పుకు ఓటేసినట్టే: బండి సంజయ్

238
KU OU destroyed by KCR: Bandi Sanjay

తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్క సారిగా రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది.

ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ కుమార్ అధికార టీఆర్ఎస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు.

గురువారం యాదాద్రి-భువనగిరిలో నిర్వహించిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి ఓటు వేస్తే చెప్పుకు ఓటు వేసినట్లేనని తెలిపారు.

సీఎం పదవిని కేసీఆర్ చెప్పుతో పోల్చారని మండిపడ్డారు. కేసీఆర్ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని సంజయ్  ఎద్దేవా చేశారు.

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఓ యుద్ధంలా జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారమవుతాయని బండి సంజయ్ తెలిపారు.

న్యాయవాది వామనరావు దంపతుల హత్యలో టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందన్నారు. ఇప్పటివరకు సీఎం స్పందించక పోవడం సిగ్గుచేటని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరుతో 70 వేలు బాకీ ఉందని చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని సంజయ్ వ్యాఖ్యానించారు.

నయీమ్ అక్రమ ఆస్తులు మెక్కిన కేసీఆర్ చేత అన్నీ కక్కిస్తామని హెచ్చరించారు.