విజయ్‌ సినిమా కథ లీకైందా!

274
story is leaked!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న విజయ్‌ నెక్ట్స్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విజయ్‌ ఫుట్ బాల్‌ నటిస్తున్న ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విజయ్‌ కోచింగ్ ఇస్తున్న టీంలోని ప్రధాన సభ్యులు ఒక్కొక్కరుగా హత్యకు గురి కావటం. ఆ హత్యలకు విజయ్‌ కారణమని పోలీసులు అరెస్ట్ చేయటం. ఆ కేసు నుంచి విజయ్‌ ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా కథ అన్న టాక్‌ వినిపిస్తోంది.

 
 

 

థ్రిల్లర్ జానర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ క్యారెక్టర్‌, పర్పామెన్స్‌ హైలెట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో విజయ్‌, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కిన తేరి, మెర్సల్‌ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా ఏర్పడ్డాయి. విజయ్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.