సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకర పోస్టులపై కేంద్రం దృష్టి సారించింది.
సోషల్ మీడియాకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి స్పందించారు.
సరైన విధివిధానాలు లేకుండా ఉన్న ఓటీటీ, సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు.
భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట విద్వేషాన్ని రగిల్చే రాతలు, వీడియోలు ఎక్కువయ్యాయని తెలిపారు.
సోషల్ మీడియాలో ఇలాంటి రాతల కారణంగా అనేక కుటుంబాలు మనోవేదనకు గురయ్యే పరిస్థితి నెలకొందని వివరించారు.
ఓటీటీలు, సోషల్ మీడియాకు ఇప్పటివరకు నియంత్రణ లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వ్యవస్థల ఉనికే ప్రమాదంలో పడిందని ఆమె అన్నారు.