తెలంగాణలోని వెటర్నరీ కళాశాలల్లో పాలిసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. గతంలో ఎస్ ఎస్ సి మార్కుల ఆధారంగా ప్రవేశాలు ఉండేవి.
ఈ విద్యా సంవత్సరం నుంచి పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నారు. గతంలో ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే పాలిసెట్‌ను నిర్వహించేవారు.
గతేడాది నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రికల్చర్ కోర్సులకు పాలిసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించారు.
ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ, పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో ని యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలను సైతం పాలిసెట్ ద్వారానే భర్తీ చేస్తారు.
ఈ మూడు కోర్సులకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు, అగ్రికల్చర్,
వెటర్నరీ కోర్సులు రాసేవారికి గణితం, ఫిజిక్స్, కెమిస్త్రీతోపాటు జీవశాస్త్రం పేపర్ ఉంటుందని అధికారులు వెల్లడించారు.