నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్ లో ప్రమాదం సంభవించింది.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని ఈ రోజు కవిత దర్శించుకున్నారు.
తిరుగుప్రయాణంలో కవిత కాన్వాయ్ లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది.
ఘటన జరిగిన సమయంలో కవిత ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారులోనే ప్రయాణిస్తున్నారు. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గత కొన్నిరోజులుగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న కవిత ఈ రోజు రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని నాగాలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.